వాలంటీర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తొలిరోజు ఆందోళనల్లో కూడా చాలామంది వాలంటీర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కాకుండా, తమ సమస్యను పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. టీడీపీ అనుకూల మీడియా దీన్ని బాగా హైలెట్ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మొదలైనట్టు హైప్ క్రియేట్ అయింది. అయితే ప్రభుత్వం మాత్రం వాలంటీర్లపై సానుకూల ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. జీతాల పెంపు, పనిఒత్తిడి తగ్గించడంపై త్వరలోనే సీఎం నేరుగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.