ఏపీలో తొలిదశ పంచాయతీ పోలింగ్ ఉదయం 6గంటలకు మొదలైంది. చలి వాతావరణం ఉన్నా కూడా ఉదయాన్నే పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరారు జనం. సామాజిక దూరం పాటించాలని అధికారులు నిబంధన పెట్టినా కూడా ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఉదయాన్నే పోలింగ్ బూత్ ల ముందు చాంతాడంత క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు పోలింగ్ ముగుస్తుంది.