ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయపోరాటం ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇల్లు దాటి బయటకు రావొద్దనే ఆదేశాలను హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చినా, మీడియాతో మాట్లాడకూడదనే ఆంక్షను మాత్రం అలానే ఉంచింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులను ఫుల్ బెంచ్ ముందు సవాల్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అత్యవసర విచారణకు అభ్యర్ధించారు. నిమ్మగడ్డ ఇచ్చిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు.