రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆ గ్రామస్తులు తిరగబడ్డారు. ఏదో బాహాబాహీకి దిగారని అనుకోవద్దు. ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఏకగ్రీవాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిమ్మగడ్డ వ్యవహార శైలిని తీవ్రంగా ఆక్షేపించారు గ్రామస్తులు. ఎన్నికలను ఏకంగా బహిష్కరించారు. నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత వరకు తమకు ఎన్నికలు వద్దని తీర్మానించారు. బరిలో ఉన్నవారంతా మూకుమ్మడిగా ఉపసంహరించుకున్నారు.