జీతాల పెంపుకోసం వాలంటీర్లు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. జీతాలు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 8వేలు కాదు, 12 వేలు కాదు.. 5వేలనుంచి ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని స్పష్టం చేసింది. ఈమేరకు సీఎం జగన్ పేరుతో నేరుగా ప్రభుత్వం వాలంటీర్లకు ఓ లేఖను విడుదల చేసింది. వాలంటీర్లు అంటే జీతం ఆశించకుండా పనిచేసేవారని, ఆ పేరుతో విధులు నిర్వహిస్తూ.. జీతాలకోసం డిమాండ్ చేయడం సరికాదని ఆ లేఖలో సీఎం జగన్ హితవు పలికారు.