నెల్లూరు జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నోటాకు రికార్డు స్థాయిలో ఓట్లు పడినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం బయటకు రాలేదు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో నోటాకు అవకాశమే లేదు. ఈ దఫా అభ్యర్థి గుర్తులతోపాటు నోటాని కూడా కూడా బ్యాలెట్ పేపర్లో ముద్రించారు. అయితే అభ్యర్థులకు పడిన ఓట్లను మాత్రమే లెక్కిస్తామని, నోటాకు ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కించబోమని ముందుగానే స్పష్టం చేశారు. అంటే నోటాకు ఓటు వేసినా కూడా.. గ్రామంలో ఎంతమంది అలా నోటాకు ఓటు వేశారనే విషయం అధికారికంగా తేలదన్నమాట.