గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవాలు అయ్యాయంటే కచ్చితంగా అక్కడ వేలంపాట నిర్వహించినట్టే అని అర్థం చేసుకోవాలి. అలా నిర్వహిస్తున్న వేలం పాటల్లో ఎక్కువగా 20లక్షల రూపాయల వరకు పాటలు వెళ్లిన ఉదాహరణలున్నాయి. ఆ తర్వాత డబ్బులు పెట్టడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడిన దాఖలాలు లేవు. కొన్ని మేజర్ పంచాయతీల్లో రూ.50లక్షల వరకు అభ్యర్థులు ఏకగ్రీవాలకోసం ఖర్చు పెట్టిన దాఖలాలున్నాయి. కానీ పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలోని ఓ చిన్న పంచాయతీలో ఏకంగా అభ్యర్థులు ఓట్లకోసమే రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారట.