ఏపీలో సొంత కారు, ఇతర పెద్ద వాహనాలు ఉన్నవారికి ఇకపై భారీ ఫైన్ పడబోతోంది. టోల్ ఫీజు రూపంలో ఆ ఫైన్ వేయబోతోంది ఏపీ సర్కారు. గతంలో తీసుకున్న నిర్ణయమే అయినా, దీనిపై ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తొలి విడతలో రాష్ట్రంలోని 10 రోడ్లను ఎంపిక చేసి, వాటి అభివృద్ధికి టెండర్లు పిలిచారు. ఈనెల 18వరకు బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తి కాగానే వెంటనే రాష్ట్ర స్థాయి టోల్ గేట్ లు వెలుగులోకి వస్తాయనమాట.