చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన మొదటి విడత పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు.పోలింగ్ బూత్ ల వద్ద స్థానికులు కట్టడి చేయడంలో వారి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాలతోపాటు రామచంద్రాపురం, నారాయణవనం మండలాల్లోని 342 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మోహరించినా టీడీపీ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు తెగబడ్డారు. రిగ్గింగ్ చేసేందుకు పక్క గ్రామాల నుంచి మనుషులను కూడా తీసుకొచ్చారు. ఈ చర్యలను అడ్డుకోబోయిన స్థానికుల పై, పోలీసులపై దాడులకు తెగబడ్డారు