తొలి విడుత పోలింగ్ లో టీడీపీ కి అనుకున్న ఫలితాలు అందుకోలేక పోయింది. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో కూడా నిరాశే మిగిలింది. అయితే రాష్ట్రంలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ధీమాతో ఉన్నారు.13వ తేదీన నిర్వహించబోయే రెండో విడత పోలింగ్ కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. తొలివిడతలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షో నడిచింది. మెజారిటీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్సీపీ-టీడీపీలు గెలుచుకున్న పంచాయతీల సంఖ్య మధ్య ఆంతరం భారీగా ఉంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన మూడు విడతల్లో అధిక పంచాయతీలను గెలుచుకోవడంపై టీడీపీ ఫోకస్ పెట్టనుందని తెలుస్తుంది.