జీతాలు పెంచాలంటూ వాలంటీర్లు రోడ్డెక్కిన వేళ, సీఎం జగన్ వారిని వారించేలా లేఖ రాసిన వేళ.. మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం కాస్త ఘాటుగానే ఈ వ్యవహారంపై స్పందించారు. వాలంటీర్లకు పని ఒత్తిడి లేదని, వారికి 50 ఇళ్లిచ్చామే కానీ, 5వేల ఇళ్లు కాదని అన్నారు. రోజుకి అరగంట పని, వారంలో మూడురోజులు పనే కదా అని తేల్చి పారేశారు. వాలంటీర్లకు జీతాలు పెంచే ప్రసక్తే లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు బొత్స.