తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ప్రభావం ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతోంది. అదే సమయంలో టీడీపీ మద్దతుతో పోటీ చేసినా ఉపయోగం లేదనే విషయం కూడా తెలిసిపోతోంది. దీంతో వైసీపీలోనే వర్గాలు మొదలయ్యాయి. ఈసారి అవకాశం మాకివ్వండి అంటే మాకివ్వండి అంటూ.. గొడవకు దిగుతున్నారు నేతలు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ గా పోటీ చేస్తున్నారు.