ఎవరెన్ని గొడవలు చేసినా, రాజీనామా డ్రామాలాడినా, మంతనాలు చేసి కార్మికులకు మాయమాటలు చెప్పినా.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తథ్యం అని స్పష్టమవుతోంది. ఎవరు ఎన్ని విన్నపాలు చేసినా కేంద్రం కరిగిపోయే అవకాశమే లేదని తేలుతోంది. రాజ్యసభలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇచ్చిన సమాధానంతో ఇది రూఢీ అయింది. 2019 అక్టోబర్ లో ఈమేరకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పోస్కో సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని తేల్చి చెప్పారు మంత్రి ధర్మేంద్ర ప్రధానం.