కేసీఆర్ సభ అంటేనే తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. ప్రతిపక్షాలపై ఆయన చేసే విమర్శలు, ఆయన విసిరే చెణకులు అందర్నీ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో అసలు విషయంపై ప్రకటన కూడా ఉంటుందని అందరూ ఆశిస్తారు. కానీ ఈసారి కేవలం విమర్శలతోనే సరిపెట్టారు సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన రైతు ధన్యవాద సభలో ఆకట్టుకునేలా ప్రసంగించిన కేసీఆర్.. నాగార్జున సాగర్ అభ్యర్థి పేరుని మాత్రం ప్రకటించలేదు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహ పడ్డాయి.