పంచాయతీ ఎన్నికల బరిలో చాలా సందర్భాల్లో బంధువులో ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఎవరు గెలిచినా అందరికీ సంతోషమే. తోడి కోడళ్లు, అత్త కోడళ్లు, అన్నదమ్ములు.. ఇలా బంధుత్వాలేవయినా రాజకీయాల్లో అవి పనికి రావంటారు. కానీ భార్యా భర్తలు ఒకరితో ఒకరు పోటీ పడటం అరుదు. అలాంటి అరుదైన పోటీకి వేదికగా మారింది కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో భార్యా భర్తలిద్దరూ సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు.