బాదం పప్పు ఆరోగ్యానికి చాల మంచిది. చాల మంది బాదం పప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటారు. బాదంని తినడం వలన రోగనిరోధక శక్తిని పెంపొందించేందకు, మెదడు ఏకాగ్రతను మెరుగుపరిచేందుకు శరీరానికి కావాల్సిన శక్తిని అందించేందకు బాదం బాగా ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. అంతేకాదు వీటిలో ఆరోగ్యకరమైన విటమిన్లు, పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్-ఇ, ఒమేగా-3 సమృద్దిగా లభిస్తాయి.