పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై ఎస్ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 17న ఎన్నికలు పూర్తయ్యే వరకు మీడియాతో మాట్లాడవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సభలు, సమావేశాలు, ప్రచారాల్లో మాట్లాడకూడదని ఎస్ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. ఉత్తర్వులు అమలు చేయాలని కలెక్టర్, ఎస్పీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ కాకుండా వేరే పార్టీ వాళ్లు నామినేషన్లు వేస్తే.. ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామన్న జోగి రమేష్ వ్యాఖ్యలపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. జోగి రమేష్ తీరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెల్లడించారు. రాజకీయ రచ్చలకు దారి తీసింది..