ప్రభుత్వంపై కస్సుబుస్సుమంటున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇప్పుడు కాస్త మెత్తబడ్డారా. ప్రభుత్వంతో స్నేహం కోరుకుంటున్నారా, అధికారులతో సయోధ్యగా మసలుతోంది అందుకేనా..? వీటన్నిటికీ ఔననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే నిమ్మగడ్డలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక తాజాగా చంద్రబాబు ఆయనపై చేసిన ఆరోపణలు కూడా ఎక్కడో తేడా కొడుతోందనే భావనను తెరపైకి వచ్చాయి. అన్నిటికీ మించిన విచిత్రం ఏంటంటే.. నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలే వద్దు అని మొండికేసిన ప్రభుత్వం ఇప్పుడు.. ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాల్టీ ఎన్నికలకు కూడా సిద్ధం కావడం.