సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ.. అంటూ తాత్కాలిక భవనాలతో సరిపెట్టిన టీడీపీ ప్రభుత్వం.. తమ హయాంలోనే శాశ్వత భవనాలకు కూడా శ్రీకారం చుట్టింది. ప్రధాన భవంతులతోపాటు.. సిబ్బంది, అధికారులకోసం అపార్ట్ మెంట్లు కూడా మొదలు పెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో నిర్మాణాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత అసలీ వ్యవహారం పూర్తిగా అటకెక్కిందనే అనుకున్నారంతా. అయితే వీటిలో ముఖ్యమైన వాటిని వెంటనే పూర్తి చేయాలని, మిగతా వాటి గురించి ఆలోచించాలని ఇటీవల సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.