కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నారంటే వాటికోసం అవస్థలు పడుతున్నవారు కొంత ఆశతో ఉంటారు. ఎప్పుడెప్పుడు దరఖాస్తులు తీసుకుంటారా, ఎప్పుడు కార్డులు మంజూరు అవుతాయా అని ఎదురు చూస్తుంటారు. ఏపీలో ఇలాంటి అవస్థలు లేకుండా.. సచివాలయంలో ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా.. నియమిత కాల వ్యవధిలో రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు కాస్త సంబరపడ్డారు. అయితే అక్కడే అధికారులు కొత్త మెలిక పెట్టారు. కొత్త కార్డులకంటే ముందుగా బోగస్ కార్డులు ఏరివేస్తామంటున్నారు.