ఎన్నికల్లో ప్రచారం చేయడం ఒకెత్తు అయితే, సరిగ్గా ఓటింగ్ ముందురోజు డబ్బులు పంచిపెట్టడం మరో ఎత్తు. ప్రచారం ఉధృతంగా చేసినా, ఎన్నికలు వచ్చే వరకు ఓటర్లను జాగ్రత్తగా చూసుకున్నా, ఓటింగ్ ముందు రోజు, లేదా ఓటింగ్ రోజు ఇచ్చే డబ్బులే అభ్యర్థుల విజయానికి ప్రధాన కారణంగా నిలుస్తాయి. అందులోనూ పార్టీల గుర్తులతో సంబంధంలేని పంచాయతీ ఎన్నికల్లో కచ్చితంగా డబ్బు ప్రభావం ఉండాల్సిందే. మొహమాటానికో, అభిమానంతోనే పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడదు. పార్టీ అభిమానం ఎలాగూ ఉండదు కాబట్టి అభ్యర్థి, నోటుతోనే ఓటరుని ప్రసన్నం చేసుకోవాలి. అయితే ఇప్పుడా నోటు ఆన్ లైన్ లో బదిలీ అవుతోంది.