వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త రాజకీయ రచ్చలకు దారి తీసింది.ఎస్ఈసీ చర్యలపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎస్ఈసీ చర్యలపై సంతృప్తిగా లేమని వర్ల రామయ్య అన్నారు. ఓటర్లను బెదిరించేలా జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఆంక్షలు కేవలం కంటితుడుపు మాత్రమేనన్నారు. ఎస్ఈసీ సీరియస్గా తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం పై చంద్ర బాబు సీరియస్ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.