రేషన్ వాహనాలను లబ్ధిదారుల ఇంటి వద్ద ఆపి సరకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే అలా వాహనాలు ఇంటి వద్దకి వచ్చే వరకు ఎవరూ ఆగడంలేదు. వీధిలోకి రేషన్ ట్రక్ వచ్చిందని తెలియడంతోనే.. అందరూ గుమికూడిపోతున్నారు. గతంలో రేషన్ దుకాణాల ముందు కనిపించే క్యూలైన్లే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. దీనిపై విమర్శలు రావడంతో ప్రభుత్వం సర్దుకుంది. మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.