వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు అంశాలు సీఎం జగన్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి ఇసుక విధానం కాగా, రెండోది మద్యం పాలసీ. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానంలో మార్పులు చేసి కొత్త విధానం తీసుకు రావడంతో రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో గృహనిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ విధానాలేనంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికి కూడా ఇసుక పాలసీపై స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతోంది ప్రభుత్వం.