రాష్ట్రవ్యాప్తంగా రెండోదశ పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. తొలిదశలో చేసిన చిన్న చిన్న తప్పుల్ని అధికారులు సరిదిద్దుకుంటారనుకుంటున్న క్రమంలో.. అంతకంటే అధ్వాన్నంగా పరిస్థితులు తయారయ్యాయని వాపోతున్నారు పోలింగ్ సిబ్బంది. పోలింగ్ విధులకు వెళ్లే ఉపాధ్యాయులు తమకు సరైన వసతి సౌకర్యాలు లేవని ఏకంగా నిరసనకు కూడా దిగుతున్నారు. నెల్లూరు జిల్లాలో పోలింగ్ మెటీరియల్ డిస్పాచ్ చేసే సమయంలోనే ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. తొలిదశకే ఇవి పరిమితం అనుకుంటే.. రెండో దశలోనూ ఆ సమస్యలు కొనసాగాయి.