ఆ కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు ఓ అలవాటు ఉంది. చిన్నదయినా, పెద్దదయినా ఏ ఫంక్షన్ జరిగినా.. అందరూ ఒకేచోట చేరుకుంటారు. దాదాపు 300మంది సభ్యులు ఒక చోట కలవాల్సిందే. అంతటి ఆప్యాయత, అనుబంధం ఆ కుటుంబాల మధ్య ఉంది. అయితే కరోనా కష్టకాలం వీరందర్నీ విడదీసింది. కలవకుండా రోజులు కూడా ఉండలేని వారిని, నెలలపాటు వేర్వేరుగా ఉంచింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇటీవల ఓ ప్రణాళిక వేసుకున్నారు. కరోనా భయం తొలగిపోయి.. ఇప్పుడిప్పుడే ప్రయాణాలు మొదలు కావడంతో అందరూ విహార యాత్రకు వెళ్దామనుకున్నారు. ఆ ఆలోచనే వారి కుటుంబాల్లో విషాదం నింపింది. అరకులో బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 22మంది తీవ్ర గాయాలపాలవడానికి కారణం అయింది.