రాజన్న రాజ్యం తెస్తామంటూ హైదరాబాద్ లో స్టేట్ మెంట్ ఇచ్చిన జగన్ సోదరి షర్మిల.. జిల్లా నేతలతో మీటింగ్ లు పూర్తి కాకముందే బెంగళూరు వెళ్లిపోయారు. తెలంగాణలో వరుసగా అన్ని జిల్లాల్లోని వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశాలు జరపాలనుకున్నారు. ఈనెల 21న ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం అవుతానని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రతినిధులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారామె. నల్గొండ జిల్లా నేతల సమావేశాన్ని హైదరాబాద్ లోనే పూర్తి చేసిన షర్మిల, ఈసారి ఖమ్మం తానే స్వయంగా వెళ్లి, అక్కడే నేతలతో భేటీ కాబోతున్నారు. అయితే అంతలోనే ఆమె బెంగళూరు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.