హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్ ప్రాంతంలో ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం ఆరోపణలతో కేసు నమోదు చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే నమోదైన కేసును తప్పుడు కేసు అని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నిర్ధరించారు. ఇక ఘట్కేసర్లో ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ నాటకం ఘటన గురించి జనం చర్చించుకుంటుండగానే.. నర్సాపూర్ లో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.