ఒక్క ఓటు తేడాతో గెలిచారు, రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటూ వచ్చే వార్తల్ని మనం చూస్తూనే ఉంటాం. ప్రత్యర్థులకు అదృష్టం బాగోలేదు అని అనుకుంటూ ఉంటాం. అయితే అలాంటి ఫలితాలు మనకి మామూలే. ఇప్పుడు మనం వినబోయే ఫలితం మాత్రం దిమ్మతిరిగే రిజల్ట్. ఈ ఫలితం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో వచ్చింది. వైసీపీ అభ్యర్థికి పోటీగా మొత్తం నలుగురు బరిలో దిగారు. ఆ గ్రామంలో పోలైన 639 ఓట్లలో నలుగురు ప్రత్యర్థులకి కలిపి వచ్చిన ఓట్ల సంఖ్య వింటే ఆశ్చర్యం కలగక మానదు. నలుగురు అభ్యర్థులకు కేవలం 23 ఓట్లు మాత్రమే రాగా.. విజేత షేక్ ఆరిఫ్ భాషాకు ఏకంగా 616 ఓట్లు వచ్చాయి.