కడపలో ఏకగ్రీవాలు ఎక్కువ అవుతున్నాయని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. బలవంతంగా అభ్యర్థుల చేత నామినేషన్ లు చేయిస్తున్నారని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పులివెందుల ప్రజలపై నమ్మకం లేకనే వైకాపా బలవంతపు ఏకగ్రీవాలకు తెగబడుతోందని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు.. శనివారం ఆయన వేంపల్లెలోని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఇంటికి వచ్చి ఆయనతో ఈ విషయం పై మాట్లాడారు.