పంచాయతీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఓవైపు చంద్రబాబు లెక్కలన్నీ తప్పులు, ఆయన మాటలన్నీ అబద్ధాలు, టీడీపీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శిస్తూనే, మరోవైపు వైసీపీ నేతలు కొత్త లెక్కలు చెప్పడానికి ఆందోళన పడుతున్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ అయిపోగానే... ఒకరికి ఇద్దరు, వీలేతై ఒకేరోజు నలుగురు వైసీపీ కీలక నేతలు ప్రెస్ మీట్లు పెట్టి, బాబు చెప్పిన విషయాలను ఖండించాల్సిన పరిస్థితి ఉంది.