ఏకంగా మంత్రి కొడాలిపై కేసు పెట్టండి అంటూ ఎస్ఈసీ పోలీసులకు ఆదేశాలివ్వడం, మీడియాతోనే కాదు, సమావేశాల్లో కూడా మాట్లాడొద్దంటూ కండిషన్ పెట్టడంతో మేటర్ సీరియస్ గా మారింది. యథావిధిగానే ఈ కండిషన్లు తీసేయాలంటూ మంత్రి కోర్టుకెక్కారు. అయితే అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తాను వివరణ ఇచ్చనా, ఎస్ఈసీ తనపై ఆంక్షలు విధించారని, అసలు తనకు వివరణ ఇవ్వడానికి కనీసం కొన్ని గంటలైనా సమయం ఇవ్వలేదనేది మంత్రి వాదన. అయితే ఎస్ఈసీ మాత్రం మంత్రిని బాగానే ఇరికించారు. కొడిలి వ్యాఖ్యలను కోర్టు కచ్చితంగా వినాలని, రాతపూర్వకంగానూ, వీడియో ఫుటేజీ రూపంలోనూ వాటిని విన్న తర్వాతే తీర్పునివ్వాలని ఎస్ఈసీ తరపు లాయర్లు వాదించారు.