రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం స్పష్టంగా తెలిసొచ్చింది. అదే ఊపులో ఆగిపోయిన పరిషత్ ఎన్నికలు, మున్సిపాల్టీ ఎన్నికలకు వైసీపీ రెడీ అంటోంది. కరోనా కారణంగా వాయిదా వేసిన ఆ ఎన్నికలను కూడా ఇప్పుడే పెట్టాలని ఎస్ఈసీ ముందుకి ప్రతిపాదన పంపింది. దీనిపై ఈరోజో రేపో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటారని, నోటిఫికేషన్ విడుదల చేస్తారని, అయితే అది కొత్త నోటిఫికేషన్ లేక ఆగిపోయిన దగ్గరనుంచి మొదలు పెట్టే నోటిఫికేషన్ అనేది తేలాల్సి ఉంది.