మరోసారి వైసీపీ.. టీడీపీని రెచ్చగొట్టింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ దీక్ష చేస్తున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఆయన దీక్ష భగ్నం చేశారు. ఇది సహజంగా జరిగే పరిణామమే అయినా సరిగ్గా చంద్రబాబు విశాఖ పర్యటనకు ముందుగా ఈ పని చేయడంతో విమర్శలు వెళ్లువెత్తాయి. కావాలనే టీడీపీ నేత దీక్షను భగ్నం చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.