ఆగిపోయిన దగ్గరనుంచే పురపాలక సంస్థల ఎన్నికలు మొదలవుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో వైసీపీలో సంతోషం మొదలైంది, అదే సమయంలో టీడీపీ ఈ విషయంపై ఆందోళనలో ఉంది. రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. అభ్యర్థులు మాత్రం కంగారు పడుతున్నారు. గతంలో నామినేషన్లు వేసినవారంతా కొత్తగా ప్రచార పర్వం ప్రారంభించబోతున్నారు.