వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి, షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. పార్టీ పెడుతున్నట్టు సంకేతాలిచ్చినా, పేరుని మాత్రం ఆమె ఇంకా బయటపెట్టలేదు. ఈ దశలో పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమేరకు ఎన్నికల కమిషన్ కి కూడా దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకనట రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రకటన తేదీని కూడా కొంతమంది ఖరారు చేయడం మొదలు పెట్టారు.