రాష్ట్రంలో రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల రీకౌంటింగ్ అంటూ హడావిడి మొదలైంది. స్వల్ప మెజార్టీ వచ్చిన సందర్భంలో పరాజితులు రీకౌంటింగ్ కి పట్టుబట్టడం సహజమే. అయితే అదే సమయంలో అధికారులు సంయమనంతో వ్యవహరించాలని, మరింత పారదర్శకంగా ఫలితాలు ప్రకటించాలని సూచించారు ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్. నెల్లూరు జిల్లాలో అధికారులకు పరోక్షంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రెండు విడదల్లో జరిగిన ఎన్నికల లెక్కింపు, ఫలితాల ప్రకటనపై కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఆయన తాజా సూచనలు చేశారు. మూడు, నాలుగు విడతల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని చెప్పారు.