ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్ల కల్లోలం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో వెలుగుచూసిన మ్యుటేషన్ చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నాయి. బ్రిటన్లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ ఇప్పటికే 80 దేశాలకు పైగా పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే వెల్లడించింది.