పిల్లలకు చదువుతోపాటు, ఆరోగ్యం కూడా అత్యవసరం అని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం కింద, ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. తాజాగా.. దాని పరిధి మరింత విస్తృతం చేస్తూ బధిర బాలలకు అండగా నిలబడతామంటోంది ఏపీ ప్రభుత్వం. చెవిటి, మూగ వైకల్యాలను జయించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కంటి వెలుగు తరహాలోనే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు చేపట్టాలని సూచించారు.