పంచాయతీ పోరులో చాలా చోట్ల ఒకే కుటుంబం పెత్తనం కొనసాగుతుంటుంది. రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తర్వాతే అన్ని వర్గాల వారికి అధికారం దక్కుతోంది. అయితే రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాల వారే తమ అనుచరులను బరిలో దింపుతూ పెత్తనం తమ చేతిలోనే ఉంచుకుంటుంటారు. ఏళ్ల తరబడి ఒకే కుటుంబం అధికారంలో ఉండటం చూసి ఉంటాం కానీ, కేవలం భార్యా భర్తలే 15ఏళ్లుగా సర్పంచ్ పదవిలో ఉండటం ఎక్కడైనా చూశారా. నెల్లూరు జిల్లా ఆ అరుదైన రికార్డుకి వేదికగా మారింది.