ఓ ఇంటర్వ్యూలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వర్షం విషయంలో కాస్త తడబడ్డారు. వర్షాలు పడకూడదని దేవుడ్ని కోరుకుంటానని చెప్పి నవ్వులు పూయించారు. ఇటీవలి భారీ వర్షాలకు హైదరాబాద్ నగర వాసులు పడిన ఇబ్బందుల్ని గుర్తు చేస్తూ ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధి మేయర్ కు ప్రశ్నలు సంధించారు. భారీ వర్షాలు కురిస్తే ఆపదలు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారని ఆమెను ప్రశ్నించారు. అయితే ఆమె ఆ ప్రశ్నకు కాస్త విచిత్రమైన సమాధానం చెప్పి షాకిచ్చారు. ‘ఫస్ట్ థింగ్ నేను దేవుణ్ని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని’ వ్యాఖ్యానించారు.