చెప్పులైన, షూలైన గడువు ముగిశాక వాడకూడదు.వీటిని మహా అయితే 6 నెలల వరకే వాడాలట. ఆ తర్వాత కూడా వాడితే ,అనారోగ్య సమస్యలు వస్తాయట. ముఖ్యంగా చెప్పాలంటే పాదాలకు పగుళ్లు ఏర్పడుతుంటాయి. అందుకే అలా ఎక్కువ కాలం వాడకుడదట.. చెప్పులు, షూలు, సాక్సుల్లో ఒక రకమైన ఫంగస్ లాంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు పెరుగుతూ ఉంటాయి. కాలం గడిచే కొద్దీ అవి కూడా బాగా వృద్ధి చెందుతాయట. మొదట్లో మనకు అంతగా తేడా తెలియదు. కానీ కొంతకాలం తర్వాత అవి కాలి నుండి శరీరం లోకి చేరుతాయి. మెల్ల మెల్లగా వాటి వల్ల కాళ్ళకు పగుళ్లు కూడా ఏర్పడి కాళ్ళు చూడటానికి అసహ్యంగా మారతాయి..కేవలం 6 నెలల వరకూ పనిచేసే లాంటి చెప్పులే కొనుక్కుని వాటిని వాడి తర్వాత వేరొకటి కొనుక్కోవడం చాలా మంచిది