తెంలగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటున్న షర్మిలపై టీఆర్ఎస్ ఆల్రడీ విమర్శలు ఎక్కు పెట్టింది. స్థానిక, స్థానికేతర అనే బేధ భావం తెరపైకి తెస్తోంది. స్థానికేతరులు పెట్టే పార్టీలేవీ తెలంగాణలు మనుగడ సాధించలేవని విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. అయితే షర్మిలవైపు నుంచి మరో కొత్త అస్త్రం సిద్ధం అవుతోందనే విషయం తెలుస్తోంది. తెలంగాణ కోడలు హోదాలో షర్మిల జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.