విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం ఏపీలో రాజకీయ రణరంగానికి దారి తీసింది. ప్రైవేటీకరణను ఆపే అధికారం కేంద్రం చేతిలో ఉన్నా కూడా.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. టీడీప నేత పల్లా శ్రీనివాసరావు ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపేందుకు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేసిన చంద్రబాబు.. విశాఖలో వైసీపీకి సవాళ్లు విసిరారు. అందరం రాజీనామా చేసి ఉక్కు పోరాటానికి సిద్ధపడతామని అన్నారు. వైసీపీ నేతలు పాదయాత్రలు మాని రాజీనామాలకు సిద్ధపడాలని కోరారు. అయితే ఊహించని విధంగా చంద్రబాబుకి వైసీపీనుంచి ప్రతిఘటన ఎదురైంది.