వైసీపీ అధికారుల ప్రలోభాలకు లొంగకుండా ఇలాంటి విజయం సాధించిన అందరికీ పవన్ అభినందనలు తెలిపారు.కొన్ని చోట్ల ప్రత్యర్థులను కూడా అపహరిస్తున్నారని విమర్శించారు. కడప జిల్లాలో జనసేన పార్టీ మద్దతుదారుడిని కిడ్నాప్ చేయడం బాధాకరమన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రెండో విడత ఎన్నికల్లో రాష్ట్రంలో పలుచోట్ల జనసేన జెండా రెపరెపలాడటం ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాదు ఈ విజయం పార్టీని బలోపేతం చేస్తుంది అనడానికి నిదర్శనం అని అన్నారు.మొత్తానికి ఈ విజయం అందరిదీ..