కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలకు తెదేపా అభ్యర్థులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కొందరు పోలీసులు బెదిరింపులకు దిగడం హేయమని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వారు పోలీసులా? లేక వైకాపా కార్యకర్తలా? అని ఓ సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు.పోలీసులు అధికారాన్ని మరచి వైసీపీ పార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు..