ఏపి సీఎం సొంత ఇలాకాలో ఎన్నికలను బహిష్కరించారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లె గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. మంగళవారం సర్పంచి, వార్డుసభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసిన వారంతా ఉపసంహరించుకున్నారు. మద్దతు మాజీ సర్పంచి కుటుంబ సభ్యులకేనని ప్రకటించారు. మరో వర్గం నేతలు మాంసం వ్యాపారం చేసుకునే వ్యక్తి కుటుంబానికి మద్దతునిచ్చారు. ఈ విషయం స్థానిక నేతలు ఎంపీ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఒక అభిప్రాయానికి రాలేదు. దీంతో మూకుమ్మడిగా అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరింపజేశారు. అక్కడ ఎన్నిక జరపలేని విషయాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్తామని జిల్లా సహాయ ఎన్నికల అధికారి వెంకటరమణయ్య తెలిపారు..