విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా కార్మిక సంఘాలు సీఎం జగన్ ని కలసి సంఘీభావం కోరాయి. అదే సందర్భంలో ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా కోరారు కార్మిక సంఘాల నేతలు. అసెంబ్లీ తీర్మానానికి సిద్ధమేనని ప్రకటించిన జగన్, అదే సమయంలో వారి ముందుంచిన ప్రతిపాదన తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. స్టీల్ ప్లాంట్ కి చెందిన 7వేల ఎకరాల భూమిని అమ్మడం ద్వారా అప్పులనుంచి గట్టెక్కొచ్చని సీఎం చెప్పినట్టు ఓ వర్గం మీడియా ప్రముఖంగా ప్రకటించింది. దీంతో టీడీపీ శ్రేణులు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.