కుప్పం నియోజకవర్గంలో టీడీపీ దారుణ పరాభావాన్ని చూసిన తర్వాత వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి పెంచారు. తెలుగుదేశం జాతీయ పార్టీ అని, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడినని చెప్పుకుంటూ చంద్రబాబు రెచ్చిపోతుంటారని, ఇకనైనా చంద్రబాబు ఆ మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు మంత్రి కన్నబాబు.