పంచాయతీ ఎన్నికల సందర్భంగా నెల్లూరు జిల్లాలో సోదాలు విస్తృతం చేశారు పోలీసులు. అధికార పక్షంతోపాటు, ప్రతిపక్ష పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మరోవైపు తొలి రెండు దశల్లో ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, మూడో దశకు చేరుకునే సరికి ఉద్రిక్తంగా మారాయి.